Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 1924 కరోనా కేసులు

Coronavirus Updates in Telangana: తెలంగాణ‌లో క‌రోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1924 కేసులు న‌మోదు కాగా.. 11 మంది మ‌ర‌ణించారు.

Raj
By Raj
Updated on: 9 July 2020 1:55 PM IST
Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 1924 కరోనా కేసులు
X
Coronavirus Updates in Telangana

Coronavirus Updates in Telangana: తెలంగాణ ‌లో క‌రోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1924 కేసులు న‌మోదు కాగా.. 11 మంది మ‌ర‌ణించారు. ఒక్క జిహెచ్ఎంసి పరిధిలోనే 1590 కేసులొచ్చాయి. ఇక మిగిలిన జిల్లాల్లో రంగారెడ్డి 99,మేడ్చల్ 43,సంగారెడ్డి 20, కరీంనగర్ 14, మహబూబ్ నగర్ 15, కామారెడ్డి 3, నల్గొండ 13, వరంగల్ రురల్ 26, వరంగల్ అర్బన్ 7, నిజామాబాద్ 19, వికారాబాద్ 11, మెదక్ 5, పెద్దపల్లి 5, సూర్యాపేట 7, ఖమ్మం 4, జగిత్యాల 3,

భద్రాద్రి కొత్తగూడెం 5, రాజన్న సిరిసిల్ల 13, ఆదిలాబాద్ 3, ఆసిఫాబాద్ 1, నగర్ కర్నూల్ 3, వనపర్తి 9, యాదాద్రి 5, నారాయణపేట 1. ఉన్నాయి. మరోవైపు కొత్తగా 992 మంది కోలుకున్నారని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 29 వేల 536 కి చేరింది. ఇందులో 17 వేల 279 మంది కోలుకున్నారు. ఇక ప్రస్తుతం 11 వేల 933 యాక్టీవ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం 324 మంది కరోనా తో చనిపోయారు.


Raj

Raj

Next Story