తెలంగాణలో కొత్తగా 1,873 పాజిటివ్ కేసులు

Arun Chilukuri
Published on: 31 Aug 2020 9:43 AM IST
తెలంగాణలో కొత్తగా 1,873 పాజిటివ్ కేసులు
X

Coronavirus Updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,873 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,24,963కి చేరింది. మృతుల సంఖ్య 827కి పెరిగింది. నిన్న ఒక్క రోజే 1,849 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 92,837కి చేరింది. ప్రస్తుతం 31,299 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. మరో 24,216 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

రాష్ట్రంలో 0.66శాతం మరణాల రేటు ఉండగా, దేశంలో 1.78శాతంగా ఉందని పేర్కొంది. రాష్ట్రంలో రికవరీ రేటు 73.3శాతంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా ఆదివారం ఒకే రోజు 37,791 టెస్టులు చేయగా.. ఇప్పటి వరకు 13,65,582 శాంపిల్స్‌ పరీక్షించినట్లు వివరించింది. 800 శాంపిల్స్‌ రిపోర్టులు రావాల్సి ఉందని, పది లక్షల జనాభాకు 36,782 మందికి టెస్టులు చేస్తున్నట్లు పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో 360 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా.. తర్వాత అత్యధికంగా కరీంనగర్ 180, రంగారెడ్డి 129, ఖమ్మం 103, నిజామాబాద్‌ 94, వరంగల్‌ అర్బన్‌ 94 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story