Coronavirus Updates in Telangana: తెలంగాణలో ఈరోజు కొత్తగా ఎన్ని కేసులంటే!

Coronavirus Updates in Telangana: తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే.. ఇక సోమవారం కొత్తగా రాష్ట్రంలో 1550 కరొనా పాజిటివ్ కేసులు వచ్చాయి.

Krishna
Published on: 13 July 2020 10:37 PM IST
Coronavirus Updates in Telangana: తెలంగాణలో ఈరోజు కొత్తగా ఎన్ని కేసులంటే!
X
Representational Image

Coronavirus Updates in Telangana: తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే.. ఇక సోమవారం కొత్తగా రాష్ట్రంలో 1550 కరొనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 36,221 కు చేరుకుంది. ఇక కొవిడ్-19 కారణంగా రాష్ట్రంలో మరో 9 మంది మరణించారు. దాంతో మరణాల సంఖ్య 365 కు చేరింది. సోమవారం నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 926 కేసులు వచ్చాయి.

ఇక మిగిలిన జిల్లాలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి రంగారెడ్డి 212, మేడ్చెల్ 53, కరీంనగర్ 86, నల్గొండ 41, ఖమ్మం 38, కామారెడ్డి 33, వరంగల్ ఆర్బన్ 16, వరంగల్ రూరల్ 8, సంగారెడ్డి 19, యదాద్రి 5, మహబుబా బాద్, మహుబుబ్ నగర్ లలో 13, పెద్దపల్లి, మెదక్ , జయశంకర్ భూపాలపల్లి లలో 6, కొత్తేగుడెం, జనగాం, సిద్ధిపేట, సూర్యాపేట జిల్లాలలో 10, రాజన్న సిరిసిల్లా 7, నిజామాబాద్ 8, వికారాబాద్ 3, నాగూర్ కర్నూల్ 2, నిర్మల్ , మంచిర్యాల్ , ఆదిలాబాద్ , వనపర్తి లలో ఒక్కో కేసు నమోదు అయినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ సోమవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపింది.

ఇక కొత్తగా 1,197 మంది కోలుకోవడంతో ఇప్పటివరకూ మొత్తం 23,679 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,178 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. ఇక సోమవారం కొత్తగా 11,252 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,81,525మందికి పరీక్షలు నిర్వహించారు. ఇదిలావుంటే గత వారం రోజులుగా కరోనా నుంచి కోలుకొని పెద్ద సంఖ్యలో రోగులు డిశ్చార్జ్ అవ్వడం సంతోషాన్ని కలిగిస్తుంది.

కరోనా కట్టడికి ప్రభుత్వం కూడా పెద్దఎత్తున చర్యలు చేపట్టింది. అందులో భాగంగా టెస్టింగ్ సామర్ధ్యాన్ని జిహెచ్ఎంసీ తోపాటుగా మరికొన్ని జిల్లాల్లో భారీగా పెంచింది. ఇక కరోనాని మరింతగా కట్టడికి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంటైన్మేంట్ జోన్లలో ఈ నెల చివరి వరకు లాక్ డౌన్ ని పొడిగించింది.



Krishna

Krishna

Next Story