Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 1410 కరొనా పాజిటివ్ కేసులు

Coronavirus Updates in Telangana: తెలంగాణలో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. గురువారం కొత్తగా రాష్ట్రంలో 1410 కరొనా పాజిటివ్ కేసులు వచ్చాయి.

Krishna
Updated on: 9 July 2020 10:42 PM IST
Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 1410 కరొనా పాజిటివ్ కేసులు
X
Coronavirus Updates in Telangana

Coronavirus Updates in Telangana: తెలంగాణ లో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. గురువారం కొత్తగా రాష్ట్రంలో 1410 కరొనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 30,946కు చేరుకుంది. ఇక కొవిడ్-19 కారణంగా రాష్ట్రంలో మరో 7 మంది మరణించారు. దాంతో మరణాల సంఖ్య 331 కు చేరింది. గురువారం నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 918 కేసులు వచ్చాయి.

ఇక మిగిలిన జిల్లాలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి రంగారెడ్డి జిల్లాలో 125, మేడ్చల్ జిల్లాలో 67, కరీంనగర్ జిల్లాలో 32, సంగారెడ్డిలో 79, ఖమ్మంలో 12, వరంగల్ అర్బన్ 34, కొత్తగూడెం 23, నల్గొండ 21, మెదక్ 17, నిజామాబాద్18, సూర్యాపేట 10, వరంగల్ రూరల్ 7. మహబూబ్ నగర్ , రాజన్న సిరిసిల్లా జిల్లాలో 08, భూపలపల్లి 6, వికారాబాద్ 5, జనగాం 2, గద్వాల్, వనపర్తి 2, మహబూబ్ బాద్ 5, యదాద్రి 2, పెద్దపల్లి, జగిత్యాల, ఆదిలాబాద్, ములుగు, సిద్ధిపేటలో ఒక్కో కేసు నమోదు అయినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ గురువారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపింది.

ఇక కొత్తగా 913 మంది కోలుకోవడంతో ఇప్పటివరకూ మొత్తం 18,192 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,423 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. ఇక గురువారం కొత్తగా 5,954మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,40, 755 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇదిలావుంటే గత వారం రోజులుగా కరోనా నుంచి కోలుకొని పెద్ద సంఖ్యలో రోగులు డిశ్చార్జ్ అవ్వడం సంతోషాన్ని కలిగిస్తుంది.

కరోనా కట్టడికి ప్రభుత్వం కూడా పెద్దఎత్తున చర్యలు చేపట్టింది. అందులో భాగంగా టెస్టింగ్ సామర్ధ్యాన్ని జిహెచ్ఎంసీ తోపాటుగా మరికొన్ని జిల్లాల్లో భారీగా పెంచింది. ఇక కరోనాని మరింతగా కట్టడికి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంటైన్మేంట్ జోన్లలో ఈ నెల చివరి వరకు లాక్ డౌన్ ని పొడిగించింది.



Krishna

Krishna

Next Story