Covid19 Patients Missing in Hyderabad: షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన జీహెచ్ఎంసీ అధికారులు..

Covid19 Patients Missing in Hyderabad: షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన జీహెచ్ఎంసీ అధికారులు..
x
Representational image
Highlights

Covid19 Patients Missing in Hyderabad: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో అన్ని జిల్లాల కంటే రెట్టింపు కేసులు నమోదవుతున్నాయి.

Covid19 Patients Missing in Hyderabad: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో అన్ని జిల్లాల కంటే రెట్టింపు కేసులు నమోదవుతున్నాయి. అంతే కాక హైదరాబాద్ చుట్టుపక్కన ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ పరిధిలో గత రెండు వారాలుగా ప్రతి రోజూ 700పైనే కరోనా కేసుల సంఖ్య ఉంటోంది.

ఈ క్రమంలోనే ప్రభుత్వం కరోనా పేషెంట్లకు హోం ఐసోలేషన్ కిట్లను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ కిట్ల సాయంతో కరోనా బాధితులు ఆస్పత్రులకు వెల్లకుండా వారి ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందవచ్చును. ఈ విధంగా చికిత్స పొందుతున్న వారి వివరాలను జీహెచ్ఎంసీ అధికారులు ఆరా తీయగా నమ్మలేని నిజాలు బయటికి వచ్చాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ఆ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. చికిత్స తీసుకుంటున్న వందలాది మంది వివరాలు సరిగా లేవని గుర్తించారు. దీంతో గత రెండు వారాలుగా హైదరాబాద్‌లో 2200 మందికిపైగా కరోనా పేషెంట్లు మిస్సయ్యారని నిర్ధారించారు. హోం ఐసోలేషన్ కిట్లను అందించడం కోసం బాధితుల వివరాలను ఆరా తీస్తుంటే ప్రతి రోజూ పదుల సంఖ్యలో బాధితుల వివరాలను వైద్య సిబ్బంధి గుర్తించలేకపోతున్నారని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (హెల్త్) బదావత్ సంతోష్ తెలిపారు.

ఈ బాధితులంతా తప్పుడు ఫోన్ నంబర్లు ఇవ్వడం, వారు నమోదు చేసిన ఫోన్ నంబర్ కూడా ఫోన్లు స్విచ్చాఫ్ రావడం. అదే విధంగా తప్పుడు అడ్రస్‌ ఇచ్చారని అధికారులు తెలిపారు. బాధితులు ఆధార్ కార్డులో ఉన్న శాశ్వత చిరునామా ఉండగా ప్రస్తుతం వారు నివాసం ఉంటున్న ప్రాంతం వివరాలు తెలియకపోవడం, కరోనా బాధితులను గుర్తించడం కష్టంగా మారుతోందని తెలిపారు. ఆధార్ కార్డులో ఉన్న చిరునామా ఆధారంగా కొంతమంది బాధితులను వెతికి పట్టుకునే ప్రయత్నం చేయగా వారిలో చాలా మంది ఐసోలేషన్ కిట్లు తీసుకోవడం లేదని జీహెచ్ఎంసీ అధికారి ఒకరు తెలిపారు. తమ ఇంటికి దూరంగా ఉన్న స్నేహితులకు, బంధువులకు కరోనా కిట్లు ఇవ్వాలని కరోనా పాజిటివ్‌గా తేలినవారు కోరుతున్నార'ని అధికారులకు తెలుపుతున్నారన్నారు.

తమ ఇంటికి వచ్చి అధికారులు కిట్లను పంపిణీ చేస్తే తమ ఫ్లాట్‌ను అపార్ట్‌మెంట్ అసోసియేషన్ వాళ్లు ఎక్కడ లాక్ చేస్తారోనని కొందరు భయపడుతున్నారన్నారు. మరి కొంత తమకు ఎక్కడు ఆస్పత్రులకు పంపిస్తారో అని భయంతో తమ ఇండ్లకు ఏకంగా వారి ఇండ్లకు తాళాలు వేసుకుంటున్నారు. దీంతో ఇలాంటి వారిని వెతికి పట్టుకోవడం కోసం జీహెచ్ఎంసీ అధికారులు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు.

కొందరికి కరోనా పాజిటివ్ అని తేలగానే ఫోన్లు స్విచ్ఛాఫ్ చేస్తున్నారని... అధికారులకు దొరకకుండా తప్పుడు అడ్రసులు ఇచ్చారని అధికారులు చెబుతున్నారు. ఇక అడ్రస్ తప్పుగా ఇచ్చిన వారు స్వచ్చందంగా ముందుకొచ్చి అధికారులకు సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ కోరారు. ప్రజలు మరింత బాధ్యతయుతంగా ఉండాలని లోకేశ్ కుమార్ హితవు పలికారు. కరోనా సోకిన వారు రోడ్ల మీద తిరిగితే వారి వల్ల ఇతరులకు ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వచ్చిన వారి పట్ల సమాజంలో ఉన్న అపోహలే దీనికి కారణమని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories