Warangal - NIT: వరంగల్ నిట్‌లో కరోనా కలకలం 11 మంది విద్యార్థులకు పాజిటివ్

Warangal - NIT: *ఈ నెల 16 వరకు సెలవులు ప్రకటన *ఆన్‌లైన్‌లోనే క్లాసుల నిర్వహణ

Shireesha
Published on: 7 Jan 2022 9:16 AM IST
Coronavirus Tension in Warangal NIT 11 Students Tested Covid Positive | Corona Live Updates
X

Warangal - NIT: వరంగల్ నిట్‌లో కరోనా కలకలం 11 మంది విద్యార్థులకు పాజిటివ్

Warangal - NIT: వరంగల్‌ నిట్ లో కరోనా కలకలం రేపింది. నిట్‌లో చదువుతున్న 11 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో నిట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 16 వరకు సెలవులు ప్రకటిస్తూ నిట్ డైరెక్టర్ NV. రమణారావు ఉత్తర్వులు విడుదల చేశారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో బోధన చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో విద్యార్థులంతా హుటాహుటిన ఇళ్లకు బయల్దేరి వెళ్లారు.

ఇటీవల క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి వెళ్లి వచ్చిన 200 మంది విద్యార్థులకు అధికారులు కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో సిబ్బంది ఒకరికి పాజిటివ్‌ రాగా.. మరో 10 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇటు ప్రైమరీ కాంటాక్టు అయిన వారందరూ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

Shireesha

Shireesha

Next Story