Top
logo

Coronavirus: తెలంగాణలో కరోనా సెకండ్‌ వేవ్‌

Coronavirus Second Wave in Telangana
X
కరోనా వైరస్(ఫైల్ ఇమేజ్)
Highlights

Coronavirus: అధికంగా పురుషులకే కొవిడ్‌ పాజిటివ్‌ * 40శాతం మంది మహిళలకు కరోనా నిర్ధారణ

Coronavirus: తెలంగాణలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇందులో అధికంగా పురుషులే కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా జన సమూహాల్లోకి ఎక్కవగా వెళ్లడం, ఉపాధి, ఉద్యోగాల్లో వీరి సంఖ్య అధికంగా ఉండటం తదితర కారణాలతో పురుషుల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 3లక్షల 5వేల కేసులు నమోదు కాగా అందులో 60.63శాతం మంది పురుషులు, 39.37శాతం మంది మహిళలు ఉన్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు 99లక్షల 3వేల 125మందికి పరీక్షలు చేయగా అందులో 3లక్షల 5వేల 309మందికి కరోనా సోకింది. కరోనా బారిన పడి ఇప్పటివరకు వేయి 683 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 3వేల 995 ఉన్నాయి.

Web TitleCoronavirus Second Wave in Telangana
Next Story