విద్యార్ధులకు శాపంగా మారిన కరోనా

విద్యార్ధులకు శాపంగా మారిన కరోనా
x
Highlights

కరోనా మహ‌మ్మారి విద్యార్దులకు శాపంగా మారింది. దేశ వ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో పాఠశాలల ప్రారంభించే అంశం కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది....

కరోనా మహ‌మ్మారి విద్యార్దులకు శాపంగా మారింది. దేశ వ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో పాఠశాలల ప్రారంభించే అంశం కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. అయినా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. స్కూళ్ల ప్రారంభంపై విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ సైతం విడుదల చేయలేదు. ఏడున్నర నెలలుగా విద్యార్ధుల బడులకు దూరంగా ఉన్నారు. ఆన్ లైన్ క్లాసులకే పరిమితం అయ్యారు. ఈ విద్యాసంవత్సరం పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు, ఏవిధంగా నిర్వహిస్తారన్నది క్లారిటీ లేకుండా పోయింది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి 15 నుంచి స్కూళ్లు మూతబడ్డాయి. ఆ తర్వాత మొదలైన లాక్ డౌన్ నుంచి నేటి వరకు తెరుచుకోలేదు. దసరా తర్వాత పాఠశాలలు ప్రారంభిస్తారని భావించినా, దీపావళికి కూడా రీ ఓపెన్ అయ్యే అకాశాలు కనిపించడం లేదు. పాఠశాలలు ప్రారంభించిన...ఏ తరగతుల వారికి ఎన్ని రోజులు, ఎన్ని క్లాసులు నడుస్తాయి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారన్నదానిపై స్పష్టమైన క్లారీటీ లేదు.

ఇప్పటికే మెజార్టీ రాష్ర్టాల ప్రభుత్వాలు పరిస్థితులకు అనుగుణంగా హైయ్యర్ క్లాసులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేపట్టినా, తెలంగాణలో మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్ణయం తీసుకోవడంలో తెలంగాణ విద్యాశాఖ తడపడుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యా వ్యవస్థపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నిస్తున్నారు. రాష్ర్టంలో సర్కార్, ప్రైవేట్ సహా మొత్తం 40 వేలకు పైగా పాఠశాలలు ఉన్నాయి. 58 లక్షల మంది విద్యార్ధులు ఆయా పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. అయినా పాఠశాలలు తెరిచే అంశంపై కనీసం రివ్యూకూడా చేయడం లేదని అకడమిక్ క్యాలెండర్ రెడీ చేయకపోవడంపై విద్యార్ధుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఈ సంవత్సరం జీరో అకడమిక్ ఇయర్ కాకుండా సిలబస్ కుదించిన విధంగా పని దినాలు కుదించి సరిబేసి సంఖ్యలో తరగతులు నిర్వహించాలని కోరుతున్నారు. ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నప్పటికీ ఫిజికల్ గా నిర్వహించినట్లయితేనే విద్యార్ధులకు అర్ధమవుతుందని ఉపాద్యాయులు చెబుతున్నారు. కరోనా ప్రికాషన్స్ తో స్కూల్స్ ప్రారంభించాలని తల్లిదండ్రులు కోరుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పాఠశాలల ప్రారంభంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విద్యార్ధుల తల్లిదండ్రులతో పాటు విద్యావంతులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories