
Coronavirus in Pragathi Bhavan: రాష్ట్రంలోని ప్రయివేటు, ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలోనూ కరోనా వైరస్ విస్తరిస్తుంది.
Coronavirus in Pragathi Bhavan: రాష్ట్రంలోని ప్రయివేటు, ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలోనూ కరోనా వైరస్ విస్తరిస్తుంది. ఇప్పుడు తాజాగా సీఎం క్యాంపు కార్యాలయమయిన ప్రగతి భవన్ లో కరోనా వైరస్ కలకలం రేపుతుంది. ప్రగతి భవన్‌లో భద్రత కోసం వచ్చిన నల్గొండ బెటాలియన్ పోలీసులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఈ నలుగురికి గురువారం రాత్రి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. అంతే కాదు ప్రగతి భవన్ లో ఎంత మంది సిబ్బంధి విధులు నిర్వర్తిస్తున్నారో వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, ప్రగతి భవన్‌కు వచ్చే సందర్శకులపై ఆంక్షలు విధించారు. మరీ అవసరం అయితే తప్ప సందర్శకులను లోనికి అనుమతించడం లేదు. ఇక సిబ్బంధికి పరీక్షలు నిర్వహించేందుకు ప్రగతి భవన్‌లోనే ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేశారు. ఇక పోతే గురువారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లేరని, ఆయన ఫాంహౌస్‌లో ఉన్నట్లుగా విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. శుక్రవారం కేసీఆర్ ప్రగతి భవన్‌కు చేరుకొనేలోపు ప్రగతి భవన్ పరిసరాలను శానిటైజ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ఇక పోతే తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నసంగతి తెలిసిందే.. నిన్న రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 1,213 కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18,570కి చేరింది. ఇందులో 9, 226 యాక్టివ్ కేసులు ఉండగా, 9,069మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నిన్న ఎనమిది మంది మృతి చెందారు. నిన్న నమోదైన 1,213 కేసులలో ఒక్క GHMC పరిధిలోనే 998 కేసులు నమోదు అయ్యాయి. ఇక మిగతా ప్రాంతాలలో చూసుకుంటే రంగారెడ్డిలో 48, మేడ్చెల్ 54, సంగారేడ్డి, మహబూబ్ నగర్, భద్రాది కొట్టేగుడెంలలో చెరో 7, కరీంనగర్, మహుబుబాబాద్, నిజామాబాదులలో చెరో 5, సూర్యాపేటలో 4, ఖమ్మం 18, నల్గొండ 8, కామారెడ్డి 2, ములుగు 4, వరంగల్ రూరల్ 10, జగిత్యాల్, నిర్మల్ లలో చెరో 4, వరంగల్ అర్బన్ 09, నారాయణపేట 2, సిరిసిల్లా 06, నాగూర్ కర్నూల్, సిద్దిపేట, వికారాబాద్, గద్వాల్, మెదక్, యదాద్రిలో ఒక్కో కేసు నమోదు అయింది.
ఇక ఇందులో ఒక్క GHMC పరిధిలోనే కరోనా కేసులు అత్యధికంగా పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది..నిన్న తెలంగాణ ప్రభుత్వం కంటోన్మెంట్ జోన్లలో జూలై 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక భారత్ లో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి.. కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 19,148 కేసులు నమోదు కాగా, 434 మంది ప్రాణాలు విడిచారు. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం 6,04,641 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,26,947 ఉండగా, 3,59,859 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 17,834 మంది కరోనా వ్యాధితో మరణించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




