ఈ నెల 21 నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి : ఈటల రాజేంద్ర


దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా తెలంగాణలో తగ్గడం శుభపరిణామమని మంత్రి ఈటల రాజేంద్ర అన్నారు.
దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా తెలంగాణలో తగ్గడం శుభపరిణామమని మంత్రి ఈటల రాజేంద్ర అన్నారు. ర్యాపిడ్ టెస్టులు చేయవద్దని ఐసిఎంఆర్ తెలిపిందని, సీఎం కేసీఆర్ ర్యాపిడ్ టెస్టులు వద్దని చెప్పినట్లు మంత్రి చెప్పారు. ర్యాపిడ్ టెస్టులు చేయలేదన్నారు. ఐసీఎంఎర్ మార్గదర్శకాలను పాటిస్తున్నామని అన్నారు. కరోనా లక్షణాలు వున్న వారికే పరీక్షలు చేయాలని ఐసిఎంఆర్ తెలిపిందని మంత్రి వెల్లడించారు.
ప్రైవేట్ ఆసుపత్రులలో కరోనా పరీక్షలకు అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. కరోనా టెస్టులు విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడటంలో రాష్ట్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో ముందుందని కేంద్రం కూడా ప్రశంసించిందని గుర్తు చేశారు. కరోనా మరణాలు దేశవ్యాప్తంగా 3.2 శాతం ఉంటే రాష్ట్రంలో 2.4 శాతం మాత్రమే ఉందని మంత్రి అన్నారు. ప్రజలంతా మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీ నిజాముద్దీన్ మర్కాజ్ వారిని ముందుగా గుర్తించి తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి ఈటల రాజేంద్ర అన్నారు.
తెలంగాణలో ఇవాళ కొత్తగా ఆరు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 1009కి చేరినట్లు మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఇప్పటివరకు 374మంది కోలుకున్నారు. ఈ వైరస్ బారిన పడి 25 మంది మృతి చెందారు. ఈ ఒక్క రోజే 42మంది డిశ్చార్జి అయినట్టు మంత్రి చెప్పారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 610మంది బాధితులు చికిత్స పొందుతున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 50శాతానికి పైగా కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదైనట్టు వెల్లడించారు. రాష్ట్రంలో మరణాలు లేకుండా కరోనా అంతమవుతుందని ఆశిస్తున్నాం అని మంత్రి అన్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



