Coronavirus: నిర్మల్ జిల్లా మహాగావ్‌లో కరోనా కలకలం

Coronavirus: ఒకే రోజు 30 మంది గ్రామస్తులకు కరోనా * మూడు రోజుల పాటు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌

Sandeep Eggoju
Updated on: 7 April 2021 1:52 PM IST
Coronavirus Cases Founded in Nirmal District Mahagaon
X

కరోన వైరస్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: కరోనా సెకండ్‌ వేవ్‌ పట్టణ ప్రాంతాల్లోనే కాదు... గ్రామాల్లో కూడా కలకలం రేపుతోంది. నిర్మల్ జిల్లా భైంసా మండలం మహాగావ్‌లో కరోనా పంజా విసిరింది. గ్రామంలో ఒకే రోజు 30 మందికి పాజిటివ్‌ రావడంతో ఆందోళన కలిగిస్తోంది. వైరస్‌ను కట్టడి కోసం గ్రామస్థులు మూడు రోజులపాటు స్వచ్చంధంగా లాక్‌డౌన్‌ విధించుకున్నారు. మహాగావ్ గ్రామం నుండి ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిపివేశారు. కరోనా భయంతో గ్రామస్థులు ఇప్పటికే ఇండ్లకే పరిమితమైయ్యారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తమ గ్రామంలోకి ఎవరు రావొద్దని మహాగావ్‌ వాసులు సూచిస్తున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story