Coronavirus: కోలుకున్న కరోనా బాధితుడు

Coronavirus: కోలుకున్న కరోనా బాధితుడు
x
Corona Virus ward
Highlights

తెలంగాణలో తొలి కరోనావైరస్ కేసు బాధితుడు కోలుకుంటున్నాడు.

తెలంగాణలో తొలి కరోనావైరస్ కేసు బాధితుడు కోలుకుంటున్నాడు. గాందీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి తాజా శాంపిల్స్‌లో నెగెటివ్ తేలింది. అతనికి బీపీ కంట్రోల్ అయ్యింది. జ్వరం తగ్గిందని సమాచారం. న్యూమోనియా తగ్గడంతో శాంపిల్స్ గాంధీ మెడికల్‌ కళాశాలలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. ఆ యువకుడి టెస్టులు నెగెటివ్ అని రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

గాంధీలోని వైరాలజీ ల్యాబ్ లో నెగెటివ్ వచ్చిన రిపోర్టును.. మరోసారి అతని శాంపిల్స్ పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపంచనున్నారు. అక్కడినుంచి రిపోర్ట్ నెగెటివ్‌ అని వస్తే అతన్ని డిశ్చార్జి చేసే అవకాశముంది. మరో రెండు, మూడు వారాలు అతడి అబ్జర్వేషన్ లో ఉంచి.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల దుబాయ్‌ వెళ్లి వచ్చిన యువకుడు కరోనా వైరస్ లక్షణాల అనుమానంతో గాంధీ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా.. దానిలో పాజిటివ్ తేలింది. అతడికి మెరుగైన చికిత్స వైద్యులు అందిస్తున్నారు.

మరోవైపు సోమవారం కరోనా లక్షణాలతో మరో 10 మంది గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. వారి నుంచి శాంపిల్స్ సేకరించి పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఒక్కరోజే 3,517 మందికి స్క్రీనింగ్ చేశారు. 51 మందికి అనుమానితులను గుర్తించగా.. 40 మందికి వారి ఇంట్లోనే సమీక్ష చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల కోసం మరో రెండు ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ కేంద్రాన్ని కోరింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories