Coronavirus: జగిత్యాల జిల్లాలో స్ట్రెయిన్ కలకలం

Coronavirus: దుబాయ్‌ నుంచి ఇండియా వచ్చిన ఇద్దరికి కరోనా స్ట్రెయిన్

Sandeep Eggoju
Updated on: 5 March 2021 1:17 PM IST
Corona Strain Cases In Jagtial District
X

కరోనా స్ట్రైన్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: జగిత్యాల జిల్లాలో స్ట్రెయిన్ కలకలం సృష్టించింది. దుబాయ్‌ నుంచి ఇండియా వచ్చిన ఇద్దరికి కరోనా స్ట్రెయిన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దుబాయ్‌ నుంచి ఇటీవల జగిత్యాల ముత్యంపేటకు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా స్ట్రెయిన్ రావడంతో ఇంట్లో ఉన్న మరో ఆరుగురికి పాజిటివ్‌గా గుర్తించారు. దుబాయ్‌ నుంచి వచ్చిన వెంకటాపూర్‌కు చెందిన మరో వ్యక్తిలో కూడా స్ట్రెయిన్‌ను గుర్తించారు. ఇద్దరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ టిమ్స్‌కు తరలించారు. అయితే ఫిబ్రవరి 25న ఒకరు, 27న మరొకరు స్వగ్రామాలకు రావడంతో కాంటాక్ట్‌ లిస్ట్‌‌ను సేకరిస్తున్నారు వైద్య బృందం.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story