Corona: ఆదిలాబాద్ జిల్లాలో కోరలు చాస్తోన్న కరోనా

Corona: గడిచిన రెండు రోజుల్లో 663 పాజిటివ్ కేసులు * కొవిడ్ తో మరో నలుగురు మృతి

Sandeep Eggoju
Updated on: 10 April 2021 1:44 PM IST
Corona Spreading In Adilabad District
X

కరోన వైరస్ (ఫైల్ ఫోటో)

Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ కోరలు చాస్తోంది. కొవిడ్ ఉధృతి కారణంగా పరిస్థితి చేయిదాటిపోతోంది. గడిచిన రెండు రోజుల్లో 663 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కొవిడ్ సోకి మరో నలుగురు మృతి చెందారు.. దాంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు ఆదిలబాద్ జిల్లా 52 మంది మృత్యువాత పడ్డారు.

అయితే ఇలానే కొనసాగితే రాబోయే రోజులు మరింత ప్రాణ నష్ట వాటిల్లే ప్రమాదం ఉందని ప్రజల్లో భయాందోళనలు అలుముకున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 2లక్షల 73 వేల 731 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 7వేల 229 మందికి పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 12వందల 35 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 12వందల 11 మంది హోమ్ ఐసోలేషన్‌లో మరో 24మంది రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story