Adilabad: కఠిన నిర్ణయం తీసుకున్న బోథ్ గ్రామ పంచాయతీ

Adilabad:గత కొద్ది రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకు కరోనా విజృంభిస్తోంది

Sandeep Eggoju
Updated on: 31 March 2021 11:48 AM IST
Corona Restrictions in Boath Adilabad District
X

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Adilabad: గత కొద్ది రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకు కరోనా విజృంభిస్తోంది. దీంతో బోథ్ గ్రామ పంచాయతీ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇకపై మాస్కులు ధరించనివారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, పోలీసులు వీధులలో తిరుగుతూ ప్రజలకు మాస్క్‌ వినియోగంపై అవగాహన కల్పించారు.

గత పది రోజుల్లో మండలంలో 45 కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. బోథ్ మండలం మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో అప్రమత్తమైన గ్రామ పంచాయతీ వారు కఠిన నిబంధనలను అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story