Corona: ఆగం చేస్తున్న జనాల అలసత్వం

Corona: People not Taking Coronavirus Seriously
x

ఆగం చేస్తున్న జనాల ఆలసత్వం

Highlights

Corona: ఆగం చేస్తున్న జనాల ఆలసత్వం * స్వీయ నియంత్రణ పాటించాలని వైద్యుల సూచన

Corona: కరోనా సెకండ్‌ వేవ్‌ వేగం మాములుగా లేదు. దొరికినవారిని దొరికినట్లు టచ్‌ చేసుకుంటూ వెళ్తోంది. అక్కడా ఇక్కడా అన్న తేడా లేదు. అదే వేగం.. అదే ఆగం.. గడదాటాలంటేనే జనం వణికిపోతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా వైరస్‌ సోకుతుందో అని టెన్షన్‌ పడుతున్నారు. కానీ కొందరు పుణ్యాత్ములు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా దర్జాగా తిరుగుతున్నారు. వచ్చేది ఎలాగూ వస్తుందని వైర్యాగ్యపు మాటలు మాట్లాడుతున్నారు. కానీ వైరస్‌ ఇలాంటివి ఏవీ చూడడం లేదు. ఎక్కడ నిర్లక్ష్యం ఉంటుందో అక్కడ నేను ఉంటా అన్నట్లు దూసుకువస్తుంది.

నమోదవుతున్న కేసులు.. పెరుగుతున్న మరణాల రేట్‌ చూస్తే.. ప్రాణం మీద బెంగ కలుగుతుంది. ఆ మాయదారి రోగం నుంచి ఎలా తప్పించుకోవాలని ప్రతిక్షణం జాగ్రత్తపడుతున్నారు. కొందరు మాత్రం లాక్‌డౌన్‌ రూల్స్‌ని పాతర వేస్తున్నారు. నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డే, గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టు గెదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీలంటూ అంతా ఒక చోట చేరి వైరస్‌కు వెల్‌కం చెబుతున్నారు.

ఇక కొందరి ఆత్మవిశ్వాసం చూస్తే జాలేస్తుంది. కరోనా గిరోనా జన్తా నహీ అంటూ పనికిరాని బిల్డప్‌ ఇస్తున్నారు. మాస్కులు ధరించడం లేదు. ఇక వేళ ధరించినా స్టైల్‌గా దాన్ని గడ్డం కిందకు లాగేస్తున్నారు. ఇలాంటి వారినే వైరస్‌ ఎక్కువగా లైక్‌ చేస్తుంది. అందుకే ఏ మాత్రం లేట్‌ చేయకుండా.. హోం క్వారంటైన్‌కు పంపిస్తుంది.

ఇక మార్కెట్లు, రైతు బజార్లు, వ్యాపార సముదాయాల వైపు తొంగి చూస్తే ప్రజల నిర్లక్ష్యం ఏ రేంజ్‌లో ఉందో కళ్లకు కడుతుంది. సోషల్‌ డిస్టెన్స్ పాటించే మనిషి మచ్చుకైనా కనిపించడు. కూరగాయలు, సరుకులు కొనే హడావుడి తప్పా వైరస్‌ వస్తుందన్న సోయి ఒక్కరిలో కనిపించడం లేదు. మాస్కులు ధరించరు. శానిటైజర్లు ముట్టరు. సామాజిక దూరం పాటించరు. ఈ రేంజ్‌లో నిర్లక్ష్యం ఉంటే కరోనా కామ్‌గా ఉంటుందా.. దాని పవరేంటో అది చూపిస్తుంది.

ఇక ఫెస్టివల్స్ వస్తే చాలు వైరస్‌ పెద్ద పండుగ చేసుకుంటుంది. భక్తులు పూజల్లో నిమగ్నమై రూల్స్‌ని పక్కనపెడుతున్నారు. దేవుడు కరుణిస్తాడో లేదో తెలియదు కానీ కరోనా మాత్రం కనికరం చూపించడం లేదు. దాని అది చేసుకుంటూ వెళ్తోంది.

ఇక వచ్చే నెలలో పెళ్లిళ్లకు ముహూర్తాలు పుష్కలంగా ఉన్నాయి. జనాలు ఇదే అలసత్వాన్ని కంటిన్యూ చేస్తే.. కరోనా బ్యాండ్‌ బజా మోగించక తప్పదు. పరిస్థితిని అర్థం చేసుకోని అందరూ అలెర్ట్ గా ఉంటేనే కరోనా కట్టడి సాధ్యమవుతుంది. లేదంటే అంతే సంగతీ.

Show Full Article
Print Article
Next Story
More Stories