Gandhi Hospital: హైదరాబాద్ గాంధీకి పది నిమిషాలకో కరోనా పేషెంట్

Gandhi Hospital: అంతేకాదు, గాంధీ ఆస్పత్రిని రేపట్నుంచి పూర్తిస్థాయి కోవిడ్‌ హాస్పిటల్‌గా మార్పు

Sandeep Eggoju
Published on: 16 April 2021 8:32 PM IST
Gandhi Hospital: హైదరాబాద్ గాంధీకి పది నిమిషాలకో కరోనా పేషెంట్
X

గాంధీ హాస్పిటల్ (ఫైల్ ఇమేజ్)

Gandhi Hospital: తెలంగాణలో కరోనా బుసలు కొడుతోంది. దాంతో, గాంధీ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ సేవలను నిలిపి వేశారు. అంతేకాదు, గాంధీ ఆస్పత్రిని రేపట్నుంచి పూర్తిస్థాయి కోవిడ్‌ హాస్పిటల్‌గా మార్చుతున్నట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. గాంధీ ఆస్పత్రిలో 450మందికి పైగా పేషంట్స్ చికిత్స పొందుతున్నారు. ఇక, ప్రతి పది నిమిషాలకు ఒకరు గాంధీ హాస్పిటల్ లో చేరుతున్నారు. నిన్న ఒక్క రోజే 150మంది కరోనా పేషంట్లు చేరారు. కోవిడ్ పేషంట్లతో గాంధీ హాస్పిటల్ ఐపీ బ్లాక్ నిండిపోయింది. దాంతో, గాంధీలో ఎమర్జెన్సీ సేవలను నిలిపి వేస్తున్నట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story