శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కరోనా కలకలం

* బ్రిటన్ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ప్రయాణికుల్లో కరోనా * ఆందోళనలో ప్రయాణికులు, అధికారులు * 5 విమానాల్లోని 15మందికి కరోనా పాజిటివ్

Sandeep Eggoju
Updated on: 27 Jan 2021 1:59 PM IST
Corona Fear in Shamshabad Airport
X

Representational Image

ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టించిన కల్లోలం అంతఇంత కాదు అయితే ఆ కల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. వ్యాక్సిన్ వచ్చిందని కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ, కరోనా పూర్తిగా అంతం కాలేదు. అయితే ఇప్పుడు మరోసారి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కరోనా కలకలం రేపింది. బ్రిటన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తం అయ్యారు.

ఇటీవల బ్రిటన్‌ నుంచి వచ్చిన 5 విమానాల్లో 15 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రయాణికులందరికి కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. వారిలో చాలా మందికి నెగిటివ్ వచ్చింది. 5 విమానాల్లో ప్రయాణించిన దాదాపు 300 మందిని క్వారంటైన్‌కు తరలించారు.

బ్రిటన్‌లో స్టార్ట్ అయ్యే సమయంలో కరోనా టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్‌గా తేలింది. దాంతో ‍‍హైదరాబాద్‌ ల్యాండ్ అయ్యాక తిరిగి పరీక్ష నిర్వహిస్తే పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దాంతో ఇది కరోనానా లేకుంటే బ్రిటన్‌లో కల్లోలం సృష్టిస్తున్న స్ట్రయిన్‌ అనేది తేలాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్‌లో పాజిటివ్ వచ్చిన వారిని గచ్చిబౌలిలోని టిమ్స్ కు తరలించారు. వారిని ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story