Corona: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న కరోనా విజృంభణ

Corona: ఏపీలో కొత్తగా 3,309 పాజిటివ్ కేసులు * తెలంగాణలో కొత్తగా 2,909 మందికి కరోనా

Sandeep Eggoju
Published on: 11 April 2021 6:43 AM IST
Corona Expanding in Two Telugu States
X

కరోనా వైరస్(ఫైల్ ఇమేజ్)

Corona: తెలుగురాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ రెండు రాష్ట్రాల్లో బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఏపీలో శనివారం కొత్తగా మూడు వేల 309 మందికి కరోనా సోకింది. అదే స్థాయిలో యాక్టివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ఏపీలో ప్రస్తుతం 18 వేల 666 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. `

అటు తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కొత్తగా 2వేల 909 మంది కరోనా బారినపడ్డారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 24 వేలకు చేరింది. మొత్తం కేసుల్లో 17వేల, 791 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ ఎంసీ పరిధిలో 487 కేసులు ఉండగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 289, రంగారెడ్డిలో 225 చొప్పున ఉన్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story