Corona Effect to Tourism Places: పర్యాటక కేంద్రాలకు కరోనా దెబ్బ.. వెలవెలబోతున్న సందర్శక ప్రాంతాలు..

Corona Effect to Tourism Places: పర్యాటక కేంద్రాలకు కరోనా దెబ్బ.. వెలవెలబోతున్న సందర్శక ప్రాంతాలు..
x
Highlights

Corona Effect to Tourism Places: పర్యాటకం మనసుకు ఉల్లాసాన్ని శరీరానికి కొత్త శక్తిని ఇచ్చే ఔషధం. అందుకే చాలా మంది కాస్త సమయం దొరికితే చాలు బ్యాగ్‌...

Corona Effect to Tourism Places: పర్యాటకం మనసుకు ఉల్లాసాన్ని శరీరానికి కొత్త శక్తిని ఇచ్చే ఔషధం. అందుకే చాలా మంది కాస్త సమయం దొరికితే చాలు బ్యాగ్‌ సర్దుకొని పర్యాటక ప్రాంతాలకు చెక్కేస్తుంటారు. కానీ మహమ్మారి కరోనా వైరస్‌ వల్ల పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాల ఆంక్షలు వైరస్‌ భయంతో పర్యటకులు సందర్శక ప్రాంతాలకు వెళ్లేందుకు పెద్దగా మొగ్గుచూపట్లేదు. దీంతో ప్రముఖ సందర్శక ప్రాంతాలన్నీ వెలవెలబోతున్నాయి.

తెలంగాణలో ఒకప్పుడు కాకతీయ రాజులు ఏలిన గడ్డ, ఇప్పుడు ప్రకృతి అందాలకు చరిత్రత్మక కట్టడాలకు, కొండకోణాలకు, జలపాతాలకు కొలువైన నేలగా పర్యాటక ప్రాంతంగా విరసిల్లుతోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఏ మూల చూసిన ప్రకృతి పరవసించే పర్యటక ప్రాంతంగా కొలువుదీరింది. చత్తీస్‌ఘడ్ కొండల నుంచి జలువారే జలపాతం నుంచి ఓరుగల్లు ఇలావేల్పు భద్రకాళి అమ్మవారి దేవస్థానం వరకు. కాళేశ్వరం నుండి పాలకుర్తి సోమనాధుని ఆలయం వరకు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి అడుగు ప్రతి ప్రాంతం పర్యాటక ప్రదేశమే. ప్రతి ఏడాది జూన్‌ మాసంలో పర్యాటకుల సందడితో ఆ ప్రాంతం కలకళలాడేది. కానీ ఈ ఏడాది పర్యాటకుల హడావుడి కనిపించడం లేదు. కరోనా మహమ్మారి ప్రకృతి అందాలకు పర్యాటకులను దూరం చేసింది.

ఒక్కప్పుడు కాకతీయుల ఏలిన రాజధాని ఓరుగల్లు. ప్రస్తుతం అది వరంగల్ జిల్లా. అప్పటి కళాకృతులు, కళాతోరణాలు, శివాలయం ఇప్పటికి సజీవంగా ఉన్నాయి. కోట అందాలు, అద్భుతమైన శిల్పకళా సంపదతో కుడిన అనేక విగ్రహాలు ఇంకా అక్కడ సజీవంగా ఉన్నాయి. వాటిని చూడటానికి ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులు వస్తుంటారు. తెలంగాణ ఇంద్రకీలాద్రిగా కొలువుదీరిన అమ్మవారిని ప్రతి ఆదివారం వేలమంది భక్తులు, పర్యాటకులు వచ్చి దర్శించుకుంటారు. ఇక వరంగల్‌లో ఉన్న మరో అద్భుత కళ కట్టడం వెయ్యి స్థంబాల గుడి. ఇక్కడి కళా అందాలను చూడటానికి చాలామంది వస్తుంటారు. కానీ కరోనా ధాటికి వరంగల్‌ పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రాలు బోసిపోతున్నాయి.

జూన్ మాసం వచ్చింది అంటే చాలా అక్కడి ప్రకృతి రామణీయతను చూడటానికి పర్యాటకులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. ఆ ప్రాంతానికి వెళితే ప్రకృతి సోయగాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు. పరవళ్లు తొక్కే జలపాతాలు, గలగల పారె గోదావరి సెలయేళ్ళు. రాష్ట్రాల నాలముల నుండి పర్యాటకులు వచ్చి సందడి చేసేవారు. కానీ కరోనా మహమ్మారి పర్యాటకులను కట్టిపడేసింది. దీంతో ఇప్పుడు ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది.

ములుగు జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలు కొలువుదీరాయి. కాకతీయులు నిర్మించిన అద్భుత కళా కట్టడం ఆధ్యాత్మిక శివాలయం రామప్ప కట్టడం. అక్కడ ఉన్న అతిపెద్ద చెరువు అందులో నీటిలో తేలియాడే ఇటుకలకు చాలా ప్రత్యేకత ఉంది. ఇక మరో పర్యాటక స్థలం లక్నవరం చుట్టుకొండలు నట్టనడుమా సరస్సు మధ్యలో మూడు ద్విపాలు. ప్రకృతి పెనవేసుకున్నట్లు ఉండే పచ్చని చెట్లు పరవళ్లు తొక్కే నీళ్లు, ఉయ్యాల వంతెనలు, సరస్సులో షికారు చేయడానికి బోట్స్ ఇలా ప్రతి అణువు పరవసించిపోయే ప్రాంతమే. కానీ ఈ పర్యాటక ప్రాంతాలు సందర్శకులు లేక నిర్మానుష్యంగా మారిపోయాయి.

ఒక్కప్పుడు మేడారం సమ్మక్క సారక్కల జాతరకు మాత్రమే భక్తులు వెళ్లేవారు. కానీ ఇప్పుడు అటవీ ప్రాంతం సైతం అన్ని ఏర్పాట్లతో మంచి పీకినిక్ స్పాట్ గా మారిపోయింది. అక్కడికి వెళితే ప్రకృతి సోయగాలు, అమ్మవార్ల దర్శనం. విందు, వినోదం ఇలా అన్ని రకాల ఆనందం లభిస్తుండటంతో ప్రజలు తండోపతండాలుగా వెళ్తుంటారు. మరో అద్భుత పర్యాటక ప్రాంతం పాండవుల గుట్ట. అక్కడి గుట్టలకు చాలా ప్రత్యేక స్థానం ఉన్నది. అక్కడికి పాండవులు వనవసానికి వచ్చినప్పుడు అక్కడ కొన్ని రోజులు గడిపిన ఆనవాళ్లు ఉన్నాయి. దానితోపాటు అక్కడి కొండలు నునుపుగా ట్రెక్కింగ్ కు చాలా అనువుగా ఉండటంతో మంచి వీకెండ్ స్పాట్ గా తయారైంది.

ఇక ఇటీవలే తెలంగాణ రాష్ట్రం కోటి ఎకరాల మగణిగా తీర్చిదిద్దాలనే లక్ష్యం తో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ప్రత్యేక పర్యటక ప్రాంతంగా కొలువుదీరింది. చుట్టూ గోదావరి నది. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం. దట్టమైన అడవి ఇలా అన్నీంటి కలబోతగా కాళేశ్వర ప్రాజెస్ట్ సైతం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. కానీ కరోనా రక్కసి గత నాలుగు నెలలులుగా భక్తులను, పర్యాటకులను కట్టిపడేసింది. పర్యాటక స్థలాలపై కరోనా ఎఫెక్ట్ చూపుతుండటంతో పర్యాటక ప్రదేశాలన్నీ బోసిపోయాయి. కరోనా మహమ్మారితో వరంగల్‌లోని టూరిజం పూర్తిగా డౌన్ అయ్యింది.



Show Full Article
Print Article
Next Story
More Stories