Corona Effect: కన్‌స్ట్రక్షన్‌ రంగంపై కరోనా ప్రభావం

Corona Effect on Construction Field
x
కన్స్ట్రక్షన్ రంగంపై కరోనా ప్రభావం (ఫైల్ ఇమేజ్)
Highlights

Corona Effect: నిర్మాణ రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కుంటుంది

Corona Effect: కన్‌స్ట్రక్షన్‌ రంగానికి కరోనా చుక్కలు చూపిస్తోంది. ఓవైపు.. లాక్‌డౌన్.. మరోవైపు పెరుగుతున్న ధరలు నిర్మాణ రంగాన్ని ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాయి. దీనికి తోడు కూలీల కొరత వేధిస్తుంది. దీంతో ఎక్కడి నిర్మాణాలు అక్కడే నిలిచిపోయాయి. ఇసుక దొరకదు.. కూలీలు ఉండరు. పని ముందుకు కదలదు. హైదరాబాద్‌లో జరుగుతున్న నిర్మాణాల్లో ఇలా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. నిర్మాణ పనులు ఆగిపోతూనే ఉన్నాయి.

నిర్మాణ రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కుంటుంది .లాక్‌డౌన్‌తో సిమెంటు, స్టీలు ఉత్పత్తి తగ్గి, కొరత నెలకొందన్న సాకుతో ఉత్పత్తిదారులు ధరలను అమాంతంగా పెంచడంతో నిర్మాణరంగం కుదేలవుతోంది. ఇతర సామగ్రి ధరలు చుక్కలనంటుతుండటం, సిమెంటు, స్టీలు ధరలు ఏడాదిలో 60 నుంచి 80 శాతం పెరగటం ఈ రంగంపై తీవ్ర ప్రభావమే చూపుతోంది. కొత్త నిర్మాణాల మాట అటుంచితే, నిలిచిపోయిన నిర్మాణాలను కూడా పూర్తిచేయలేని దుస్థితి. గత నాలుగైదేళ్లలో ఇంత పెద్ద మొత్తంలో ధరల పెరుగుదల ఎప్పుడూ జరగలేదు.ఈ స్థితిలో రోజువారీ విక్రయాలు నాలుగోవంతుకు పడిపోయాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రయివేటు నిర్మాణాలు 15నుంచి 25 శాతమే జరుగుతున్నాయి.కరోనా రెండోదశ ఉద్ధృతంగా ఉండటంతో సిమెంటు, స్టీలు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడిందని కంపెనీలు చెబుతున్నాయి. కూలీలు లేకపోవటంతో సుమారు నెల రోజులుగా ఉత్పత్తి నిలిచిపోయిందని, నామమాత్రంగా ఉన్న సిబ్బందితో యంత్రాల నిర్వహణ పనులు చేయిస్తున్నాయి. హమాలీలు, వాహన డ్రైవర్ల కొరతతో ఉన్న నిల్వలను తరలించడం కూడా ఇబ్బందికరంగానే మారిందని అంటున్నారు. ఇసుక, ఇటుకలు మినహా మిగిలిన అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి. నిర్మాణ కార్మికుల కొరత వల్ల కూలి కూడా ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది.

నిర్మాణ రంగంలో ప్రధాన వస్తువులు అయిన సిమెంటు బస్తా ధరను కేవలం లాక్ డౌన్ సమయంలో లనే.420 నుంచి 450 వరకు పెంచారు. స్టీలు ధర టన్ను రూ.60 వేలు దాటింది. కిటికీలు, తలుపులు, ఇంటీరియర్‌లో ఉపయోగించే చిన్నపాటి మేకుల ధరలు 75 శాతానికి పైగా పెరిగాయి.గత సంవత్సరం ఒక సిమెంట్ సంచి ధర 260 ఉండగా ప్రస్తుతం 420 - 450 వరకు కొనసాగుతుంది.ఏకంగా 80 శాతం పెరిగింది.గత సంవత్సరం లో స్టీల్ లో 41 వేలు ఉండగా ప్రస్తుతం 61 వేలు దాటింది.ఇంటర్ వైరింగ్ 20 నుండి 30 పెరగగా మేకులు 70 నుండి 120 రూపాయల వరకు పెరిగాయి.కొరత పేరుతో మార్కెట్లోకి సిమెంట్ ని తక్కువగా తీసుకురావడం వల్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి.

సిమెంటు, స్టీలు పరిశ్రమలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి నియంత్రణ లేకపోవటంతో ఇష్టం వచ్చినట్లుగా ధరలు పెరుగుతున్నాయని క్రేడయి జాతీయ ఉపాధ్యక్షులు రాంరెడ్డి తెలిపారు.సిమెంటు తయారీదారులు కొన్నేళ్లుగా ఏడాదిలో మూడు నాలుగు సార్లు ధరలు పెంచుతున్నారు. 30 శాతం వరకు పెరిగిన నిర్మాణ వ్యయం కొనుగోలుదారులపై గణనీయ ప్రభావం చూపుతుందన్నారు. మరోవైపు విక్రయాలూ లేవు. విక్రయించిన ఫ్లాట్లకు సంబంధించిన సొమ్ము కూడా వసూలు కాని పరిస్థితి ఉందని కరోనా మొదటి దశలో నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. రెండో దశలో నిర్మాణాలతోపాటు కొనుగోళ్లపై కూడా ప్రభావం పడిందన్నారు. కూలీలా కొరత ఉన్న అధిగమించినప్పటికి పెరిగిన మెటీరియల్ ధరలతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందన్నారు.కేంద్ర ప్రభుత్వం సిమెంట్ ని అత్యంత ఖరీదైన వస్తువుగా చూపిస్తూ జిఎస్టీ లో అత్యధికంగా 28 శాతం సిమెంట్ కి ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.

కరోన తో అన్ని రంగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ నిర్మాణ రంగంలో మాత్రం కొంతవరకు కోలుకున్న కొన్ని కంపెనీలు కావాలని కొరత సృష్టించి అధిక ధరలు పెంచడం వల్ల నిర్మాణ రంగంలో ఉన్న ఇబ్బందుల పై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ధరల నియంత్రణ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories