Coronavirus: తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

Coronavirus: కొత్తగా 1,078 కరోనా కేసులు * గడిచిన 24 గంటల్లో కరోనాతో ఆరుగురు మృతి

Sandeep Eggoju
Updated on: 3 April 2021 11:32 AM IST
Corona Cases Increasing in Telangana
X

కరోన వైరస్ 

Coronavirus: తెలంగాణ కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఇటీవల వరుసగా రోజువారీ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఇవాళవెయ్యికి పైగా నమోదవడంతో ఆందోళన రేకెత్తిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,078 కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. మహమ్మారి ప్రభావంతో మరో ఆరుగురు మృత్యువాతపడ్డారు.

తాజాగా 331 మంది బాధితులు కోలుకొని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం 6900 యాక్టివ్‌ కేసులు రాష్ట్రంలో ఉన్నాయని, 3వేల116 మంది బాధితుల హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పింది. తాజాగా నమోదైన కేసులు అత్యధికంగా జీహెచ్‌ఎంసీలోనే 283 ఉన్నాయి. శుక్రవారం ఒకే రోజు 59వేల 705 కొవిడ్‌ టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story