Coronavirus: తెలంగాణలో కొత్తగా 535 కరోనా కేసులు

Coronavirus: తెలంగాణలో 3,06,339కు చేరిన కరోనా కేసులు

Sandeep Eggoju
Published on: 28 March 2021 10:56 AM IST
Corona Cases Hiking in Telangana
X

కరోన 

Coronavirus: తెలంగాణలో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. నిన్న రాత్రి 8గంటల వరకు 57వేల 942 మందికి కరోనా టెస్ట్‌లు చేయగా కొత్తగా 535 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ముగ్గురు మరణించారు.

కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1688కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 278 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4వేల 495 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 1,979 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 154 కేసులు నమోదయ్యాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story