Coronavirus: తెలంగాణ‌లో పెరుగుతున్న క‌రోనా కేసులు

Coronavirus: 24 గంటల్లో కొత్తగా 394 కరోనా కేసులు * మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,118

Sandeep Eggoju
Updated on: 21 March 2021 1:57 PM IST
Corona Cases Hiking In Telangana
X

కరోన (ఫైల్ ఫోటో)

Coronavirus: తెలంగాణలో క‌రోనా కేసుల సంఖ్య మ‌రింత‌ పెరిగిపోయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 394 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 194 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3లక్షల, 3వేల,118 కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం 2లక్షల, 98వేల, 645 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య లక్షా, 669గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 2వేల, 804 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,123 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్తగా 81 మందికి క‌రోనా సోకింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story