Coronavirus: తెలంగాణలో కొత్తగా 1,498 పాజిటివ్ కేసులు

Coronavirus: కొవిడ్‌తో మరో ఆరుగురు మృతి * 1,729కి చేరిన మృతుల సంఖ్య

Sandeep Eggoju
Updated on: 6 April 2021 1:47 PM IST
Corona Cases Hiking In Telangana-06-04-2021
X

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. నిన్నటితో పోల్చితే ఇవాళ మరింత ఎక్కువ మందికి కరోనా సోకింది. ఇవాళ కొత్తగా 14వందల 98 మందికి కొవిడ్ సోకినట్టు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కొవిడ్‌తో మరో ఆరుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 17వందల 29కి చేరింది.

గడిచిన 24గంటల్లో 62 వేల 350 మందికి టెస్ట్‌లు నిర్వహించగా వారిలో 14వందల 98 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో 3లక్షలకు పైగా కేసులున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం పదివేలకు దగ్గరగా యాక్టివ్ కేసులున్నాయి ఇవాళ కొవిడ్‌ నుంచి కోలుకుని మరో 245 మంది కోలుకున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story