Medak: ఏడుపాయల ఆలయ ఈవోకు కరోనా

Medak: వారం రోజుల పాటు ఆలయం మూసివేత

Sandeep Eggoju
Updated on: 19 March 2021 11:48 AM IST
Corona Case Found in Edupayala Durga Bhavani Temple
X

ఏడుపాయల దేవస్థానం (ఫైల్ ఫోటో)

Medak: మెదక్ జిల్లాలోని ప్రముఖ క్షేత్రం ఏడుపాయలలో కరోనా కలకలం రేపింది. ఆలయ ఈవోకు టెస్టుల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో వారం రోజుల పాటు ఆలయం మూసివేస్తున్నట్లు తెలిపారు ఆర్డీవో సాయిరాం. ఈవోకు కొవిడ్ పాజిటివ్‌ రావడంతో ఆలయంలోని సిబ్బందికి ఇవాళ టెస్టులు చేస్తున్నారు. గత వారమే శివరాత్రి సందర్భంగా మూడురోజుల పాటు ఆలయంలో ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలకు భారీగా భక్తులు తరలివచ్చారు. అటు సిబ్బంది కూడా వారం రోజుల పాటు ఉత్సవాల ఏర్పాట్లలో మునిగిపోయింది. దీంతో అటు సిబ్బంది, భక్తుల్లో కొవిడ్ భయం పట్టుకుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story