Cordon And Search: పోలీసుల కార్డన్‌ సెర్చ్‌లతో మళ్లీ కదలిక వస్తుందా..?

Cordon And Search In Hyderabad
x

Cordon And Search: పోలీసుల కార్డన్‌ సెర్చ్‌లతో మళ్లీ కదలిక వస్తుందా..?

Highlights

Cordon And Search: మూడు కమిషనరేట్లలో ప్రస్తుతం సీపీల ముందున్న పెద్ద టాస్క్ కార్డన్ సెర్చ్

Cordon And Search: కార్డన్ సెర్చ్. నేరాల నియంత్రణకు పోలీసులు అనుసరించే ఒక ఆపరేషన్. అనుమానిత ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా ఆకస్మికంగా తనిఖీలు చేపడతారు పోలీసులు. ప్రతి ఇంట్లో సోదాలు చేసి అందులో అనుమానంగా ఉన్న నేరగాళ్లను గుర్తించడం, అక్రమ మద్యం, గుట్కా, దొంగ వాహనాలను సీజ్ చేయడం, బాల కార్మికులను గుర్తించడానికి ఈ సెర్చ్ ఆపరేషన్ ఎంతో ఉపయోగపడుతుంది. కార్డన్‌ సెర్చ్‌ల ద్వారా నేరాల నియంత్రణకు అవకాశం ఉంటుంది.

క్రిమినల్ యాక్టివిటీస్‌ను, ప్రమాదాలను ముందే గుర్తించవచ్చు. ఐతే గ్రేటర్‌లో కొంతకాలంగా కార్డన్‌ సెర్చ్‌లు చేపట్టడం లేదు పోలీసులు. మూడు కమిషనరేట్ల పరిధిలో అసలు కార్డన్ సెర్చ్ అనే పదమే వినిపించడం లేదు. దీంతో నేరగాళ్లు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది.

నేరాల నియంత్రణకు కొత్త ప్రభుత్వంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు, కార్డన్ సెర్చ్‌లకు మళ్లీ కదలిక వస్తుందా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. క్రిమినల్ యాక్టివిటీస్‌పై ఫోకస్ పెట్టడంలో నాటి సెర్చ్ ఆపరేషన్లు కీలక పాత్ర పోషించాయి. అనుమానిత ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేయడంతో దొంగ బైకులు, డ్రగ్స్, గంజాయి, మద్యం, గుట్కా రవాణా కట్టడిలో చాలా వరకు సక్సెస్ అయ్యారు పోలీసులు. పట్టణాల్లో ప్రజల భద్రతకు, నేర నియంత్రణకు కార్డన్‌ సెర్చ్‌లు భేష్ అనిపించుకున్నాయి.

రౌడీ షీటర్లు, అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టడంలో కీలక పాత్ర పోషించాయి. ఐతే ఇప్పుడు కార్డన్‌ సెర్చ్‌లు లేకపోవడంతో నేరగాళ్లు మరింతగా రెచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. తమ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించే ప్రమాదం ఉంటుంది. దీంతో గ్రేటర్‌ను క్రైమ్ ఫ్రీ సిటీగా మార్చేందుకు ప్రస్తుత పోలీస్ బాసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు. మళ్లీ కార్డన్‌ సెర్చ్‌లను మొదలుపెడతారా.. అనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories