Fake Education Certificates: నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్.. వందకు పైగా నకిలీ సర్టిఫికెట్లు

Cops Bust Fake Educational Certificate Racket
x

Fake Education Certificates: నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్.. వందకు పైగా నకిలీ సర్టిఫికెట్లు 

Highlights

Fake Education Certificates: నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ముఠాను మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Fake Education Certificates: నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ముఠాను మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 18 యూనివర్సిటీలకు చెందిన ఫేక్ సర్టిఫికెట్లను ఈ గ్యాంగ్ తయారీ చేసిందని తెలిపారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర. ఈముఠా సింగిల్ సిటింగ్‌లో టెన్త్, ఇంటర్, డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్స్ అందిస్తున్నట్లు గుర్తించామన్నారు. డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్స్ 60వేలకు, బీటెక్ సర్టిఫికేట్స్ రెండున్నర లక్షల వరకూ విక్రయించేవారని, స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.

ఈ ముఠా నుంచి 100 మందికి పైగా ఫేక్ సర్టిఫికెట్స్ పొందారని వెల్లడించారు. కొంత మంది ఈ ఫేక్ సర్టిఫికెట్స్ తో ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తుందని, నిందితుల నుంచి 70 ఫేక్ సర్టిఫికేట్స్, 4 ఫేక్ స్టాంప్స్, CPU లు, బ్యాంక్ కార్డ్స్ , ఆధార్ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్స్ స్వాధీనం చేసుకున్నట్లు సీపీ స్టెఫెన్‌ రవీంద్ర వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories