ఎలా పరిష్కరిద్దాం?..హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యపై సమన్వయ సమావేశం

Hyderabad Traffic: హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య పరిష్కరించడమే ప్రధాన అజెండా

Shekhar G
Updated on: 27 Jan 2024 1:45 PM IST
Coordination Meeting On Traffic Problems in Hyderabad
X

ఎలా పరిష్కరిద్దాం?..హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యపై సమన్వయ సమావేశం

Hyderabad Traffic: భాగ్యనగర ప్రజలను వేధిస్తోన్న ట్రాఫిక్ సమస్యపై హైదరాబాద్ పోలీసులు ఫోకస్ పెట్టారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో హైదరాబాద్ సీపీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో సమన్వయం సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సహా డీసీపీలు, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

గత కొద్ది రోజులుగా సిటీలో ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవుతుండడంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను అధిగమించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమావేశంలో చర్చిస్తున్నారు. మెయిన్‌గా హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడమే టార్గెట్‌గా అధికారుల సమావేశం కొనసాగుతుంది.

Shekhar G

Shekhar G

Next Story