Mahabubabad: కోళ్లకు కూలర్.. ఎండకు చనిపోకుండా చల్లని వాతావరణం

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో చికెన్ షాపు యజమాని ప్రయత్నం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 15 May 2024 3:04 PM IST
Cooler for chickens in summer
X

Mahabubabad: కోళ్లకు కూలర్.. ఎండకు చనిపోకుండా చల్లని వాతావరణం

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో చికెన్ షాపు యజమాని ప్రయత్నం ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ఇటు మనుషులు అటు మూగ జీవాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎండల తీవ్రత కారణంగా కోళ్లు చనిపోవడంతో చికెన్ సెంటర్ నిర్వాహకులు నష్టాలను చవి చూడాల్సివస్తుంది. దీంతో ఎండల తీవ్రత నుంచి కోళ్లను రక్షించుకోవడం కోసం మహబూబాబాద్ జిల్లాలో ఓ చికెన్ షాప్ నిర్వాహకులు వినూత్న ప్రయత్నం చేశారు. కోళ్లకు కూలర్ ఏర్పాటుచేసి.. అవి చల్లని వాతావరణంలో ఉండేలా చేస్తున్నారు. కోళ్ల షెడ్ చుట్టూ.. గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసి.. వైపుల ద్వారా నీరు అందిస్తూ.. కోళ్లు ఎండకు చనిపోకుండా.. కాపాడుకుంటున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story