Eye Conjunctivitis: తెలుగు రాష్ట్రాల్లో కలవరపెడుతోన్న కండ్ల కలక.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమంటోన్న వైద్యులు..!

Conjunctivitis Cases Rise in Telugu States
x

Eye Conjunctivitis: తెలుగు రాష్ట్రాల్లో కలవరపెడుతోన్న కండ్ల కలక.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమంటోన్న వైద్యులు..!

Highlights

Eye Conjunctivitis: తెలుగు రాష్ట్రాల్లో కండ్ల కలక కలవరపెడుతోంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది కేసులు ఎక్కువయ్యాయి.

Eye Conjunctivitis: తెలుగు రాష్ట్రాల్లో కండ్ల కలక కలవరపెడుతోంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది కేసులు ఎక్కువయ్యాయి. మలేరియా, డెంగ్యూ, ఫ్లూతో పాటు కండ్ల కలక కేసులు పెరుగుతుంటాయి. పాఠశాలల్లో చిన్నారుల నుంచి కళ్ళ కలక వ్యాప్తి ఎక్కువగా ఉంది. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ళలో విద్యార్థులు కళ్ళకలక భారిన పడుతున్నారు

వాతావరణం మారడంతో వైరస్‌లు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా కళ్ళకు సంబంధించిన కేసుల సంఖ్య పెరుగుతుంది. దీంతో సరోజినీ కంటి ఆస్పత్రికి బాధితులు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా కళ్ళ కలక వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏడాదితో పోలిస్తే ఈసారి కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. నిన్న ఒక్కరోజే 95 కేసులు నమోదయ్యాయని వైద్యులు వివరించారు.

చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కళ్ళ కలకల భారిన పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో నేత్ర విభాగాలకు వచ్చే బాధితుల సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఐడ్రాప్స్‌ సులువుగా తగ్గిపోతోందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. మెడికల్‌ షాపుల్లో కళ్ళ కలక మందులకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది.

నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో పాటు అల్పపీడనం ప్రభావంతో కొద్ది రోజులుగా రాష్ట్రంలో వర్షాలు దంచికొట్టాయి. బలమైన గాలులు తోడవ్వడంతో వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. గాల్లో తేమశాతం పెరిగింది. ఈ మార్పుల కారణంగా వైరస్‌ ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. బ్యాక్టీరియా కళ్ళను ప్రభావితం చేస్తోంది. కళ్ళ కలక చిన్న ఇన్‌ఫెక్షనే అయినప్పటికీ రోజువారీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఏ పని చేసుకోనీయకుండా ఇబ్బందిపెడుతోంది. గాలి ద్వారా సోకే ఈ బ్యాక్టీరియా వాతావరణంలో మురికి కాలుష్య కారకాలు పెరగడం వల్ల వ్యాప్తి చెందుతోంది. మందులు వాడకపోయినప్పటికీ వారం రోజుల్లో తగ్గే అవకాశం ఉందని, కంటి సమస్యలు రాకుండా ఉండేందుకు యాంటీ బయోటిక్‌ డ్రాప్స్‌ వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.

అప్రమత్తతతోనే కళ్లకలక వ్యాధిని అరికట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే కంటికి సంబంధించి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కలక వచ్చిన వారు తాత్కాలికంగా కళ్ల అద్దాలు వాడటం ద్వారా ఇతరకు వైరస్ సోకకుండా అడ్డుకునే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories