TS Inter Results 2022: ఇంటర్ ఫ‌లితాల్లో స‌త్తా చాటిన అవిభ‌క్త క‌వ‌ల‌లు వీణ, వాణి

Hyderabad Conjoined Twins Vani and Veena Passed in Inter Exams
x

TS Inter Results 2022: ఇంటర్ ఫ‌లితాల్లో స‌త్తా చాటిన అవిభ‌క్త క‌వ‌ల‌లు వీణ, వాణి

Highlights

Twins Vani and Veena: అవిభ‌క్త క‌వ‌ల‌లు వీణ‌, వాణి ఇంట‌ర్ ఫ‌లితాల్లో త‌మ స‌త్తా చాటారు.

Twins Vani and Veena: అవిభ‌క్త క‌వ‌ల‌లు వీణ‌, వాణి ఇంట‌ర్ ఫ‌లితాల్లో త‌మ స‌త్తా చాటారు. ఇంట‌ర్మీడియ‌ట్‌ ఫ‌లితాల్లో వారిద్ద‌రూ ఫ‌స్ట్ క్లాస్‌లో పాస‌య్యారు. ఇంట‌ర్‌లో సీఈసీ కోర్సును అభ్య‌సించిన వీణ‌కు 712, వాణికి 707 మార్కులు వ‌చ్చాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ వీణ-వాణీలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

వీణ-వాణీల భవిష్యత్తుకు అవసరమైన అన్ని సదుపాయాలను అందిస్తామని, వారి కలలను సాకారం చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వీణ – వాణిల చ‌దువుకు స‌హ‌క‌రించిన అధికారులను మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ ప్ర‌త్యేకంగా అభినందించారు. అయితే వీరిద్ద‌రూ ఇంట‌ర్ ప‌రీక్ష‌లు స్వ‌యంగా రాశారు. ఈ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ మార్కులతో పాసైన వీణ వాణిలు చాటెడ్ అకౌంట్స్ చదవాలన్నది తమ లక్ష్యమని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories