MLC Election: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిపై దాడి

Graduate MLC: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల వేళ స్వతంత్ర అభ్యర్థిపై దాడి జరిగింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 May 2024 12:19 PM IST
MLC Election: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిపై దాడి
X

MLC Election: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిపై దాడి

Graduate MLC: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల వేళ స్వతంత్ర అభ్యర్థిపై దాడి జరిగింది. నార్కట్‌పల్లి మండలం కేంద్రంలోని డోకూరు పంక్షన్ హాలులో కాంగ్రెస్ నేతలు గ్రాడ్యుయేట్ ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని స్వతంత్రం అభ్యర్థి అశోక్ ఆరోపించారు. డబ్బులు పంచుతున్నారని అడ్డుకోబోయిన అశోక్ ‌పై కాంగ్రెస్ శ్రేణులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారని స్వతంత్ర అభ్యర్థి అశోక్ ఆరోపించారు. ఘటనపై నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా... తన ఫిర్యాదు పట్ల పోలీసులు పట్టించుకోవడం లేదంటూ స్వతంత్ర అభ్యర్థి అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారని.. ఆరోపిస్తూ.. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story