రాహుల్ వరంగల్ టూర్.. గాంధీ భవన్‎లో మళ్లీ పాస్‌ల లొల్లి...

Gandhi Bhavan: గతంలో రావిర్యాల, ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభలోనూ పాస్‎ల లొల్లి...

Shireesha
Published on: 5 May 2022 4:52 PM IST
Congress Women Leader Fires about Not Giving Passes to Rahul Gandhi Warangal Meeting | Live News
X

రాహుల్ వరంగల్ టూర్.. గాంధీ భవన్‎లో మళ్లీ పాస్‌ల లొల్లి...

Gandhi Bhavan: గాంధీ భవన్‎లో మళ్లీ పాస్‌ల లొల్లి మొదలైంది. రేపు వరంగల్ లో రాహుల్ టూర్ నేపథ్యంలో ఈసభకు సంబంధించిన పాసులకు తమకు ఇవ్వకపోవడంపై మహిళాకాంగ్రెస్ అధ్యక్షురాలు సునితారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీలో తమకు గౌరవం దక్కడం లేదన్న ఆమె.. మహిళా కాంగ్రెస్ కు బిచ్చం వేసినట్లు పాసులు ఇస్తున్నారని మండిపడ్డారు.

పని చేయని అనుబంధ విభాగాల నేతలకు వందల పాసులు ఇస్తున్న పీసీసీ పెద్దలకు తాము కనిపించడం లేదా అంటూ మండిపడ్డారు. గతంలో రావిర్యాల, ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభల సమయంలో కూడా పాసుల కోసం లొల్లి జరిగింది.మళ్లీ రాహుల్ టూర్ సమయంలో పాసుల గొడవ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదాలను స్పష్టం చేస్తోంది.

Shireesha

Shireesha

Next Story