Mlc Kavitha: రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని కాంగ్రెస్‌ ఓర్చుకోలేకపోతుంది

తొమ్మిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత

Dhatripriya
Published on: 8 Jun 2023 6:11 PM IST
Congress Will Not Be Able To Tolerate The Development In The State Says Mlc Kavitha
X

Mlc Kavitha: రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని కాంగ్రెస్‌ ఓర్చుకోలేకపోతుంది

Mlc Kavitha: తొమ్మిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో నిర్వహించిన చెరువుల పండగలో పాల్గొన్న కవిత.. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ మంచి జరగాలనే సంకల్పంతో పాలన సాగుతుందన్నారు. ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్న కాంగ్రెస్‌ నేతలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో జరిగిందని.. దేశానికి తెలంగాణ రోల్‌ మోడల్‌గా మారిందన్నారు కవిత. కాంగ్రెస్ నేతలు అభివృద్ధిని ఓర్చుకోలేక ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. మహేశ్‌కుమార్ గౌడ్ తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు.

Dhatripriya

Dhatripriya

Next Story