Khammam: నేడు ఖమ్మంలో కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన ప్రదర్శన

Khammam: సాయంత్రం 4 గంటలకు టూటౌన్ పీఎస్‌ నుంచి భారీ ర్యాలీ

Dhatripriya
Published on: 24 April 2023 8:50 AM IST
Congress Unemployment Protest In Khammam Today
X

Khammam: నేడు ఖమ్మంలో కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన ప్రదర్శన

Khammam: తెలంగాణలో నిరుద్యోగుల పక్షాన పోరాటాలకు హస్తం పార్టీ సిద్ధమైంది. ఇప్పటికే ఉద్యమకార్యాచరణ ప్రకటించిన కాంగ్రెస్‌...అందులో భాగంగా ఇవాళ ఖమ్మంలో భారీ ర్యాలీతో పాటు బహిరంగ సభ నిర్వహించనుంది. నిరుద్యోగ సభకు టీ.పీసీసీ చీఫ్ రేవంత్ తో పాటు జాతీయ, రాష్ట్ర సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొననున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని..కాంగ్రెస్ క్యాడర్ భగ్గుమంటోంది. TSPSC పేపర్‌ లీకేజీతో పాటు టెన్త్‌ ప్రశ్న పత్రాల లీకేజీ, ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని గాంధీభవన్ నేతలు ఫైరవుతున్నారు. మరోవైపు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రం కూడా మాట తప్పిందని హస్తం నేతలు మండిపడుతున్నారు. సో.. వీటన్నింటిపై పోరాడాలని డిసైడ్ అయిన కాంగ్రెస్..రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ నిరసన సభలు నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా.. ఇవాళ సాయంత్రం ఖమ్మంలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి మయూరి సెంటర్‌ వరకు నిరుద్యోగ నిరసన ర్యాలీతో పాటు.. బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story