నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ సత్యాగ్రహ దీక్ష

Congress Satyagraha Deeksha: గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్న రేవంత్‌రెడ్డి

Jyothi
Published on: 19 Jun 2022 8:48 AM IST
Congress Satyagraha Deeksha At Gandhi Bhavan Today
X

నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ సత్యాగ్రహ దీక్ష

Congress Satyagraha Deeksha: అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అటు విపక్షాలు సైతం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష చేపట్టనుంది. టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో దీక్షకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జరిగే దీక్షలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పాల్గొనున్నారు.

ఆర్మీ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. యువత ఆలోచనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మోడీ సర్కార్ తీరును నిరసిస్తూ.. ఇవాళ గాంధీ భవన్‌లో సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలిపారు. అగ్నిపథ్‌ పేరుతో కొత్త పథకం తీసుకొచ్చి సైన్యంలో చేరాల్సిన యువతను తీవ్రంగా అవమానపరుస్తున్నారని విమర్శించారు.

Jyothi

Jyothi

Next Story