ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తం

* మంత్రి పువ్వాడ అజయ్‌ పై భట్టి విక్రమార్క ఫైర్‌ * పువ్వాడ నియంతలా వ్యవహరిస్తు్న్నారని ఆరోపణ

Arun Chilukuri
Published on: 6 Feb 2021 2:45 PM IST
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తం
X

ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని భట్టి విక్రమార్క అన్నారు. అహంకారంతో, అక్రమ కేసులతో బెదిరిస్తూ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇక ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తమవుతుందని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్యం టాగూర్, రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్‌ కార్యచరణపై చర్చిస్తామని వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story