Congress: ప్రజా దీవెన సభ.. లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ అడుగులు

Congress: సభకు హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు

Shekhar G
Published on: 9 March 2024 11:20 AM IST
Congress Public meeting at Medchal Gundlapochampally today
X

Congress: ప్రజా దీవెన సభ.. లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ అడుగులు

Congress: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. మేడ్చల్ జిల్లాలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాదీవెన సభ నిర్వహించనుంది. గుండ్లపోచంపల్లిలో సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు ముఖ్యఅతిథిగా టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు.

ఈ నెల 11న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి ప్రజాదీవెన పేరుతో మణుగూరులో సభను ఏర్పాటు చేయనుంది. ప్రజాదీవెన సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొనున్నారు. మణుగూరులో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి పర్యటించున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, మహబూబ్ నగర్, చేవెళ్ల సభల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. మూడు నెలల కాంగ్రెస్ ప్రజాపాలనపై బీఆర్ఎస్‌ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story