హైదరాబాద్‌ కమిషనరేట్‌ వద్ద నేడు కాంగ్రెస్‌ నిరసన

* తెలంగాణ కాంగ్రెస్‌ వార్‌రూమ్‌పై దాడికి నిరసనగా ఆందోళన

R Tripura Malini
Published on: 14 Dec 2022 8:57 AM IST
Congress Protest Today At Hyderabad Commissionerate
X

హైదరాబాద్‌ కమిషనరేట్‌ వద్ద నేడు కాంగ్రెస్‌ నిరసన

Congress: కాంగ్రెస్ స్ట్రాటజీ టీమ్‌ హెడ్ సునీల్ కనుగోలు కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసుల దాడికి నిరసనగా ఇవాళ నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద నిరసన వ్యక్తం చేయనున్నట్లు TPCC చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసనలతో పాటు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

నిన్న మాదాపూర్‌ ఇనార్బిట్‌మాల్‌ సమీపంలోని కాంగ్రెస్ స్ట్రాటజీ టీమ్‌ హెడ్ సునీల్ కనుగోలు కార్యాలయంలో కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లను పోలీసులు సీజ్‌ చేశారు. ప్రభుత్వానికి సీఎం కేసీఆర్‌‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఎస్‌కే టీమ్‌ కాంగ్రెస్ కోసం పనిచేస్తోంది. ఎస్‌కే కార్యాలయంపై పోలీసుల దాడిని కాంగ్రెస్‌ నేతలు ఖండించారు. సునీల్‌ కార్యాలయాన్ని కుట్రపూరితంగా సీజ్‌ చేశారని ఆరోపించారు. ప్రభుత్వ, పోలీసు చర్యలను ఖండిస్తూ నిరసన తెలిపారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story