Congress protest on petrol price:పెట్రో మంటలు.. కాంగ్రెస్ ఆందోళనలు

Congress protest on petrol price:పెట్రో మంటలు.. కాంగ్రెస్ ఆందోళనలు
x
Highlights

Congress protest on petrol price: రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో ధరలపై కాంగ్రెస్ మండిపడింది.. తెలంగాణాలో అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించింది. దీనికి సంబంధించి క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా పెట్రోల్ ఎందుకు పెంచుతున్నారంటూ ప్రశ్నించారు

Congress protest on petrol price: రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో ధరలపై కాంగ్రెస్ మండిపడింది.. తెలంగాణాలో అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించింది. దీనికి సంబంధించి క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా పెట్రోల్ ఎందుకు పెంచుతున్నారంటూ ప్రశ్నించారు. ఒక పక్క కరోనా విలయంతో నానా ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజానీకానికి ఇది మరింత భారమైందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పరిస్తితి కొనసాగితే అందరికీ ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరించారు.

పెట్రో ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ పార్టీ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. ఏఐసీసీ పిలుపు మేరకు కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టింది. నిరసన అనంతరం పార్టీ నేతలు ఆయా జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలను సమర్పించారు. పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఉపసంహరించాలని రాష్ట్రపతిని కోరుతూ ఆ వినతిపత్రాన్ని రూపొందించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గినా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించక పోగా పెంచడం, ఎక్సయిజ్‌ పన్నులు యూపీఏ హయాంలో ఉన్నదాని కంటే పెరగడం తదితర అంశాలను ఆ వినతిపత్రంలో ప్రస్తావించారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్‌కు టీపీసీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఖమ్మం కలెక్టర్‌కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఈ వినతిపత్రాలను సమర్పించారు. హైదరాబాద్‌ కలెక్టరేటు ముందు ధర్నా నిర్వహించడానికి నగర కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు గాంధీభవన్‌లో జమ కాగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌యాదవ్‌, పార్టీ నేత దాసోజు శ్రవణ్‌లను మాత్రమే హైదరాబాద్‌ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించేందుకు పోలీసులు అనుమతించారు. కాగా.. పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని కోరుతూ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. రాష్ట్రపతికి సోమవారం లేఖ రాశారు. ఆదిలాబాద్‌, నల్లగొండ కలెక్టరేట్‌ల వద్ద కాంగ్రెస్‌ నాయకులు ధర్నాలు నిర్వహించి, ఆటోను తాళ్లతో లాగి నిరసన తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories