Marri Shashidhar Reddy: కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి బహిష్కరణ

* నిన్న ఢిల్లీలో అమిత్‌షాను మర్రి కలవడంతో చర్యలు తీసుకున్న కాంగ్రెస్

R Tripura Malini
Published on: 19 Nov 2022 5:29 PM IST
Marri Shashidhar Reddy: కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి బహిష్కరణ
X

Marri Shashidhar Reddy: మర్రి శశిధర్‌పై కాంగ్రెస్ అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది. నిన్న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను మర్రి శశిధర్‌రెడ్డి కలవడంతో..ఆయనపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. దాదాపు ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

నిన్న ఢిల్లీలో అమిత్‌షాను కలిసిన మర్రి శశిధర్‌రెడ్డి ఆ తర్వాత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ వ్యాధి సోకిందని అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. దీంతో ఆయనపై క్రమశిక్షణా సంఘం నోటీసులు కూడా జారీ చేసింది.

R Tripura Malini

R Tripura Malini

Next Story