Harish Rao: హస్తం నేతలకు అధికారం యావ తప్ప.. ప్రజల ఘోష పట్టదు

Minister Harish Rao: ఖమ్మంలోని 7 మండలాలను కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ఏపీకి అప్పగించాయి

Shekhar G
Published on: 30 Jun 2023 5:24 PM IST
Congress Party Only Wants Power They Dont Look At Peoples Problems Says Harish Rao
X

Harish Rao: హస్తం నేతలకు అధికారం యావ తప్ప.. ప్రజల ఘోష పట్టదు

Minister Harish Rao: అడవి బిడ్డలను అన్నదాతలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు మంత్రి హరీష్‌రావు. పోడు పట్టాలు అందుకున్న గిరిజన బిడ్డలకు ఇక నుంచి అటవీ అధికారుల వేధింపులు ఉండవని ఆయన భరోసానిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్రంగా మండిపడ్డారు హరీష్‌రావు. హస్తం నేతలకు అధికారం యావ తప్ప.. ప్రజల ఘోష పట్టదంటూ ఫైర్‌ అయ్యారు. ఖమ్మంలోని 7 మండలాలను కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ఏపీకి అప్పగించాయన్నారు. ఈ ఇద్దరు తోడుదొంగల వల్లే ఖమ్మంతో పాటు తెలంగాణ రాష్ట్రం నష్టపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే డబ్బు అహ‍ంకారంతో విర్రవీగుతున్నారో.. వారికి ఖమ్మం ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు మంత్రి హరీష్‌.

Shekhar G

Shekhar G

Next Story