Vijayashanti: కాంగ్రెస్ లో చేరిన విజయశాంతికి కీలక పదవి..!

Vijayashanti: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా టీ- కాంగ్రెస్ దూసుకుపోతుంది.

Arun Chilukuri
Published on: 18 Nov 2023 10:34 AM IST
Congress Party Campaign And Planning Committee For  Telangana Assembly Election 2023
X

Vijayashanti: కాంగ్రెస్ లో చేరిన విజయశాంతికి కీలక పదవి..!

Vijayashanti: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా టీ- కాంగ్రెస్ దూసుకుపోతుంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరికొన్ని రోజుల సమయం మాత్రం ఉండటంతో ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్లు, మేనిఫెస్టోతో ప్రచారం హోరెత్తిస్తోంది. ఈ క్రమంలో టీ- కాంగ్రెస్ ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీలను నియమించింది. ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌, కన్వీనర్‌గా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన లేడీ ఫైర్ బ్రాండ్ విజయశాంతిని నియమించారు.

ఈ కమిటీలో 15 మంది సీనియర్ నేతలను కన్వీనర్లుగా నియమించారు. సీనియర్ నేతలు మల్లు రవి, కోదండరెడ్డి, వేం నరేందర్ రెడ్డి, సమరసింహారెడ్డి, పుష్పలీల, అనిల్, రాములు నాయక్, పిట్ల నాగేశ్వరరావు, ఒబెదుల్లా కొత్వాల్, రమేష్ ముదిరాజ్, పారిజాత రెడ్డి, సిద్ధేశ్వర్, రామ్మూర్తి నాయక్, ఇబ్రహీం, దీపక్ జాన్ ఈ కమిటీలో కన్వీనర్లుగా ఉన్నారు. మహేశ్వరం టికెట్ ఆశించి భంగపడ్డ మేయర్ పారిజాత రెడ్డికి ఈ కమిటీలో చోటు కల్పించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story