Uttam Kumar Reddy: రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదు

Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన నడుస్తోందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

Arun Chilukuri
Updated on: 18 April 2022 9:30 PM IST
Congress MP Uttam Kumar Reddy Slams TRS Government
X

Uttam Kumar Reddy: రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదు

Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన నడుస్తోందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సామాన్య ప్రజలు బతికే పరిస్థితులు లేవని ఆయన దుయ్యబట్టారు. టిఆరెస్ నాయకులు పోలీసులతో కలిసి అరాచకం చేయడంవల్లే కామారెడ్డిలో తల్లీకొడుకులు చనిపోయారని ఉత్తమ్ విమర్శించారు. మంథనిలో న్యాయవాద దంతులని చంపితే ఇప్పటివరకు న్యాయం జరగలేదని ఆయన చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థకు ఉన్న మంచిపేరు ప్రత్యేక తెలంగాణలో సర్వనాశనమైందని మండిపడ్డారు. ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోందని, ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రజలు బొందపెట్టడం ఖాయమని ఉత్తమ్ అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story