కేసీఆర్ చలిజ్వరం వచ్చి పడుకున్నాడు: రేవంత్‌‌రెడ్డి

Arun Chilukuri
Published on: 13 Feb 2021 7:38 PM IST
కేసీఆర్ చలిజ్వరం వచ్చి పడుకున్నాడు: రేవంత్‌‌రెడ్డి
X

కేసీఆర్ చలిజ్వరం వచ్చి పడుకున్నాడు: రేవంత్‌‌రెడ్డి

ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా‌‌ను కలిసిన తర్వాత సీఎం కేసీఆర్ చలిజ్వరం వచ్చి పడుకున్నాడని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పోరాడినట్లు డ్రామాలు ఆడిందని.. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ భయపడిపోయారన్నారు. బీజేపీ తీసుకొచ్చిన నల్లచట్టాల వల్ల రైతులు పెద్ద కంపెనీలకు బానిసలుగా మారబోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు భూములు పంచింది కాంగ్రెస్ అని గుర్తుచేశారు. అదానీ, అంబానీల కోసమే నల్ల చట్టాలు తెచ్చారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story