MP Komatireddy Venkat Reddy over Coronavirus Outbreak: రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ నెలకొంది

MP Komatireddy Venkat Reddy over Coronavirus Outbreak: రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ నెలకొంది
x
Komati Reddy Venkat Reddy (File Photo)
Highlights

MP Komatireddy Venkat Reddy over Coronavirus Outbreak: ఉస్మానియా హాస్పిటల్ లోకి నీళ్లు వచ్చాయంటే ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్ధమవుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

MP Komatireddy Venkat Reddy over Coronavirus Outbreak: ఉస్మానియా హాస్పిటల్ లోకి నీళ్లు వచ్చాయంటే ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్ధమవుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పోయిందని ఆయన అన్నారు. కరోనాతో ప్రజలు చనిపోతుంటే కేసీఆర్ కు కనబడడం లేదా అన్ని ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ప్రజల ఆరోగ్యం పైన, కరోన పైన సమీక్ష నిర్వహించడం లేదని ఆయన అన్నారు. ఓ వైపు రాష్ట్రంలో కరోనా వ్యాపిస్తుంటే ఈ సమయంలో వెయ్యి కోట్ల తో కొత్త సచివాలయ నిర్మాణం అవసరమా అన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అన్ని ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆయన అన్నారు.

ప్రజల ఆరోగ్యాలను కాపాడని కేసీఆర్ ముఖ్యమంత్రి గా కొనసాగడానికి అనర్హుడని ఆయన ఎద్దేవాచేసారు. కమిషన్లు దండుకోవడం తప్ప ప్రజల ఆరోగ్యం పైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు శ్రద్ధ లేదని ఆయన అన్నారు. ఇలాంటి సమయంలో సచివాలయం పైన సమీక్ష నిర్వహించడం విడ్డురంగా ఉందన్నారు. దేశంలో ఇంత దుర్మార్గమైన పాలన ఏ రాష్ట్రంలో కూడా లేదని ఆయన అన్నారు. టిఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ లో రాష్ట్రపతి పాలనను విధించాలని సూచించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను రాష్ట్రపతికి నివేదిస్తాం అని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ వెంటనే ఉస్మానియా హాస్పిటల్ ను సందర్శించాలని సూచించారు.

కరోనాని ఆరోగ్య శ్రీ లో చేర్చాలని డిమాండ్ చేసినా ఈ ప్రభుత్వం చేర్చడం లేదన్నారు. కరోన మందులను, ఆక్సిజన్ సిలెండర్ లను బ్లాక్ లో అమ్ముతుంటే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రజల ఆరోగ్యాలను కేసీఆర్ గాలికి వదిలేసారన్నారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. దేశ ప్రజలు కేసీఆర్ పాలనను చూసి అసహించుకుంటున్నారన్నారు. వెంటనే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేసారు. కేసీఆర్ పాలన పైన ఎవరికి నమ్మకం లేదని తెలిపారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ నెలకొందని, త్వరలోనే రాష్ట్రపతిని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలం కలుస్తాం అని ఆయన అన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories