కాంగ్రెస్ లో కోమటి రెడ్డి బ్రదర్స్ ఆశలు గల్లంతు అయినట్లేనా..?

Arun Chilukuri
Updated on: 1 Jan 2021 1:44 PM IST
కాంగ్రెస్ లో కోమటి రెడ్డి బ్రదర్స్ ఆశలు గల్లంతు అయినట్లేనా..?
X

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన రాజగోపాల్ రెడ్డి దర్శనం అనతరం, తాను బీజేపీలో చేరనున్నానని ప్రకటించారు. ఈ కామెంట్స్ ఇప్పడు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పీసీసీ రేసులో ఉన్నారని తీవ్రంగా ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో రాజగోపాల్ రెడ్డి ఇలాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

గత కొద్దిరోజులుగా టీపీసీసీ అధ్యక్షుడి కోసం తీవ్ర కసరత్తు జరుగుతోంది. రేసులో ఉన్న ప్రముఖుల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒకరి ప్రచారం కూడా సాగుతోంది. ఈ సమయంలో తాను బీజేపీలో చేరనున్నాని ప్రకటించారు రాజగోపాల్ రెడ్డి. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి రానట్టేనా అనే సందేహం పలువురు నేతలకు కలుగుతోంది. అందుకే రాజగోపాల్ రెడ్డి సైతం, బీజేపీలో చేరుతామని ప్రకటించారా అనే అనుమానం కాంగ్రెస్ నేతల్లో మొదలైంది.

నిన్నటి వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు, కాంగ్రెస్ లో కోమటి రెడ్డి బ్రదర్స్ ఆశలు గల్లంతు అయినట్లేనా అనే సందేహాలు హస్తం నేతల్లో కలుగుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అంతర్యం కూడా ఇదేనేమో అని నేతలు భావిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story