త్వరలో బీజేపీలో చేరుతా : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

త్వరలో బీజేపీలో చేరుతా : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
x
Highlights

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో బీజేపీలో చేరతానని ప్రకటించారు. శుక్రవారం నాడు తిరుమల...

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో బీజేపీలో చేరతానని ప్రకటించారు. శుక్రవారం నాడు తిరుమల శ్రీవారిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోందన్నారు. బీజేపీ తెలంగాణలో బలమైన శక్తిగా ఎదుగుతుందని మొట్టమొదటగా చెప్పిన వ్యక్తిని తానేనని అన్నారు.

ఇదే సమయంలో తన అన్న, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బీజేపీలో చేరతారా? అని మీడియా ప్రతినిథులు అడగగా ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. అన్నదమ్ములుగా కలిసే ఉన్నప్పటికీ రాజకీయంగా ఎవరి అభిప్రాయాలు వారివే అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక పీసీసీ చీఫ్ ఎంపికపైనా ఆయన స్పందించారు. పీసీసీ చీఫ్ పోస్ట్ కోసం రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డిలు గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్నారని చెప్పారు. అయితే వారి ప్రయత్నాలు ఎంత వరకు విజయవంతం అవుతాయో కాలమే నిర్ణయిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.Show Full Article
Print Article
Next Story
More Stories