కేటీఆర్‌ వద్దు ఈటలను సీఎం చేయండి: జీవన్‌రెడ్డి

*కేటీఆర్‌కు వారసత్వం అనే విమర్శ ఉంది: జీవన్‌రెడ్డి *ఈటల ముందుకు వస్తే... ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారు: జీవన్‌రెడ్డి *ఈటలకు సీఎం అవకాశం కల్పిస్తే మంచిది: జీవన్‌రెడ్డి

Samba Siva Rao
Published on: 4 Feb 2021 7:35 PM IST
కేటీఆర్‌ వద్దు ఈటలను సీఎం చేయండి:  జీవన్‌రెడ్డి
X

తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఈటల రాజేందర్ సీఎం కావడానికి అన్ని అర్హతలున్నాయన్నారు. ఆయన సీఎం అవ్వాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయం కాదని.. ప్రజల అభిప్రాయమన్నారు. కేటీఆర్ సీఎం పదవికి అర్హుడే కానీ, ఆయన పై వారసత్వం అనే విమర్శ వస్తోందని వెల్లడించారు. కేటీఆర్ మీద వచ్చే విమర్శలు.. ఈటల మీద రావని స్పష్టం చేశారు. ఈటెల లాంటి నాయకుడు ముందుకు వస్తే ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇస్తారని జీవన్ రెడ్డి అన్నారు. ఎంపీగా గెలిచిన 100 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానన్న ధర్మపురి అర్వింద్ ఎక్కడున్నారని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story